న్యూఢిల్లీ : దేశంలోనే సెమి కండక్టర్ల (చిప్‌ల) తయారీ జరిగితే ఎలక్ట్రానిక్స్ వస్తువుల రేట్లు బాగా తగ్గుతాయని వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్‌తో కలిసి గుజరాత్‌లో రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో మొట్టమొదటి చిప్ తయారీ ప్లాంట్‌ని పెడుతున్నామని ఆయన వివరించారు. ‘ప్రస్తుతం ఒక ల్యాప్‌టాప్ ధర ఒక రూ. లక్ష పడుతోంది. అదే గ్లాస్ (స్క్రీన్)లు, సెమికండక్టర్లు దేశంలోనే అందుబాటులోకి వస్తే ల్యాప్‌టాప్ ధర రూ. 40 వేలకు దిగొస్తుంది’ అని ఆయన ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తైవాన్, కొరియాలలో తయారవుతున్న ఇటువంటి గ్లాస్‌లు (స్క్రీన్) త్వరలో దేశంలో కూడా తయారవుతాయని అన్నారు. మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం కూడా చిప్‌లను తయారు చేయాలని ఈ కంపెనీ చూస్తోంది. కాగా, అన్ని అనుమతులు వస్తే ఇంకో రెండేళ్లలో మొదటి ప్రొడక్ట్‌ను విడుదల చేస్తామని అనిల్ అన్నారు.
వేదాంత షేర్లు జూమ్
కొత్త ప్లాంట్‌కు సంబంధించి ప్రకటన రావడంతో వేదాంత షేర్లు బుధవారం సెషన్‌లో దూసుకుపోయాయి. కంపెనీ షేరు 10 % లాభపడి 305 వద్ద క్లోజయ్యింది. వేదాంత షేరు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నికరంగా 14 % తగ్గింది. రెలిగేర్ బ్రోకింగ్ ఈ కంపెనీ షేరుపై ‘అమ్మొచ్చు’ రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ధర రూ. 235 గా నిర్ణయించింది. మరోవైపు సెంట్రమ్ బ్రోకింగ్, జేపీ మోర్గాన్‌లు ‘కొనొచ్చు’ రేటింగ్ ఇచ్చి టార్గెట్‌ధరను వరసగా రూ. 507 రూ. 490 గా నిర్ణయించాయి.