నరాలు తెగే ఉత్కంఠ మధ్య బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి లిస్ట్ ను సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో సోమవారం (ఆగస్టు 21న ) విడుదల చేశారు. వేములవాడలో అభ్యర్థు మార్పు తప్పడం లేదన్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం అక్కడ చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. జర్మనీ పౌరసత్వం వల్ల ఈసారి ఆయనకు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు.
* సిట్టింగుల్లో ఏడుగురు అభ్యర్థులను మారుస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. తాను గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
* బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, కోరుట్ల, మెట్ పల్లి, వైరా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
* ఈసారి అనారోగ్య కారణాల వల్ల విద్యాసాగర్ కు కాకుండా ఆయన కుమారుడు డాక్టర్ సంజయ్ కు కోరుట్ల టికెట్ ఇస్తామన్నారు
* ములుగు నుంచి నాగజ్యోతికి టికెట్ ఇస్తామన్నారు. ప్రస్తుతం నాగజ్యోతి ములుగు జెడ్పీ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు.
* కంటోన్మెంట్ నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితకు టికెట్ ఖరారు చేశారు.
* హుజురాబాద్ టికెట్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి కేటాయించారు.
* దుబ్బాక నుంచి ప్రస్తుత మెదక్ సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
* స్టేషన్ ఘన్ పూర్ టికెట్ కడియం శ్రీహరికే కేటాయించారు.
* నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహాల్ నియోజకవర్గాల టికెట్లపై క్లారిటీ రావాల్సి ఉంది.
* కోరుట్ల, ఉప్పల్, మెట్ పల్లి నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
* బోథ్ టికెట్ ను అనిల్ జాదవ్ కు, ఖానాపూర్ టికెట్ ను జాన్సన్ నాయక్ కు, ఆసిఫాబాద్ టికెట్ ను కోవా లక్ష్మీకి, వేములవాడ టికెట్ ను లక్ష్మీ నరసింహరావు, వైరా టికెట్ ను మదన్ లాల్ కు కేటాయించారు.
నియోజవర్గం - అభ్యర్థి
1. కామారెడ్డి, గజ్వేల్- కేసీఆర్
2.చెన్నూరు -బాల్క సుమన్
3. బెల్లంపల్లి- దుర్గం చిన్నయ్య
4. మంచిర్యాల- నడిపల్లి దివాకరరావు
5. సిర్పూర్- కోనేరు కోనప్ప
6. ఖానాపూర్- భూక్యా జన్సర్ రాఠోడ్ నాయక్
7. ఆదిలాబాద్ - జోగురామన్న
8. బోథ్ - అనిల్ జాదవ్
9. నిర్మల్ - ఇంద్రకరణ్‌రెడ్డి
10. ముథోల్ - విఠల్‌రెడ్డి
11. ఆర్మూర్- ఆశన్నగారి జీవన్‌రెడ్డి
12. బోధన్ -షకీల్ ఆహ్మద్
13. జుక్కల్- హనుమంత్ షిండే
14. బాన్సువాడ- పోచారం శ్రీనివాస్‌రెడ్డి
15. ఎల్లారెడ్డి- జాజుల సురేందర్
16. నిజామాబాద్ అర్బన్- బిగాల గణేశ్
17. నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్థన్
18. బాల్కొండ - వేముల ప్రశాంత్‌రెడ్డి
19.కోరుట్ల - కల్వకుంట్ల సంజయ్
20.ఆర్మూర్ - ఆశన్నగారి జీవన్‌రెడ్డి