గెలిచినా.. చెన్నై ఇంటికే
దుబాయ్: గత పదేళ్లుగా తిరుగులేని విజయాలు సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్.. ఐపీఎల్–13లో నిరాశపర్చింది. వరుస వైఫల్యాలతో ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలిగిన ఫస్ట్ టీమ్‌గా నిలిచింది. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే స్వల్పంగా ఉన్న సీఎస్‌కే ప్లే ఆఫ్ ఆశలపై రాజస్తాన్ నీళ్లు చల్లింది. తర్వాతి మ్యాచ్‌లో రాయల్స్.. ముంబైపై గెలవడంతో ధోనీసేన నాకౌట్ రేస్ నుంచి వైదొలగక తప్పలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 145/6 స్కోరు చేసింది. కోహ్లీ (50), డివిలియర్స్ (39) రాణించారు. కరన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత చెన్నై 18.4 ఓవర్లలో 150/2 స్కోరు చేసి గెలిచింది. రుత్‌రాజ్ (65 నాటౌట్), రాయుడు (39) చెలరేగారు.
స్టోక్స్ సెంచరీ
ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (60 బాల్స్‌లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 107 నాటౌట్) సెంచరీతో దుమ్మురేపడంతో ముంబై ఇండియన్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 196 రన్స్ టార్గెట్‌ను రాయల్స్ 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శాంసన్ (54 నాటౌట్) ఆకట్టుకున్నాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా (60 నాటౌట్), సూర్యకుమార్ (40), ఇషాన్ కిషన్ (37), సౌరభ్ తివారి (34) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 195/5 స్కోరు చేసింది.
For More News..