పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్) : సౌతాఫ్రికా, వెస్టిండీస్ తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఓవర్‌నైడ్ స్కోరు 30/0తో చివరి రోజు, సోమవారం ఆట కొనసాగించిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 173/3 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని విండీస్‌కు 298 రన్స్ టార్గెట్ ఇచ్చింది. విండీస్ ఛేజింగ్‌కు వచ్చిన వెంటనే వర్షం మొదలైంది.
చివరకు బ్యాడ్ లైట్‌తో మ్యాచ్ ముగిసే సమయానికి కరీబియన్ జట్టు 56.2 ఓవర్లలో 201/5 స్కోరుతో నిలిచింది. అలిక్ అతాజనే (92) సత్తా చాటాడు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 327 రన్స్ చేయగా.. విండీస్ 233 స్కోరుకే ఆలౌటైంది. కేశవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈనెల 15న రెండో టెస్టు మొదలవుతుంది.