రాష్ట్రంలో మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ క్లినిక్

ఎంజీఎం, వెలుగు : రాష్ట్రంలోనే మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ క్లినిక్ ను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్​లో కలెక్టర్ గోపి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ట్రాన్స్​జెండర్​క్లినిక్​రాష్ట్రంలోనే మొదటిదని, దక్షిణ భారతదేశంలో రెండోదన్నారు. దీనివల్ల సుమారు 4000 మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ట్రాన్స్ జెండర్ల రాష్ట్ర అధ్యక్షురాలు లైలా మాట్లాడుతూ ఈ క్లినిక్ వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మేజర్ సర్జరీలు, లేజర్ ట్రీట్మెంట్ తో పాటు మరిన్ని సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలలని కలెక్టర్ ను కోరారు. హాస్పిటల్​సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, ఆర్ఎంఓ మురళి పాల్గొన్నారు.