- కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్
సుజాతనగర్, వెలుగు : ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. సుజాతనగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్నుంచి నాయకులగూడెం వరకు మంగళవారం సెంట్రల్ పోలీస్ ఫోర్స్, స్థానిక పోలీసు సిబ్బంది కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. చుంచుపల్లి, జూలూరుపాడు సీఐలు రాయల వెంకటేశ్వర్లు, ఇంద్రాసేనారెడ్డి, ఎస్సై లు జూబెదా బేగం, జీవన్ రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.