జంట జలాశయాలకు తగ్గుముఖం పట్టిన వరద

జంట జలాశయాలకు తగ్గుముఖం పట్టిన వరద

హైదరాబాద్/గండిపేట, వెలుగు: జంట జలాశయాలకు పై నుంచి వరద తగ్గుముఖం పట్టింది. బుధవారం రాత్రి వరకు ఉస్మాన్​సాగర్​13 గేట్ల ఎత్తి ఉంచగా, గురువారం 6 గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి వదిలారు. ఇన్ ఫ్లో 1,800 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 2,442 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి వరకు హిమాయత్​సాగర్ 8 గేట్లు ఎత్తగా గురువారం ఒక గేటు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం 400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 330 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. మూసీ ఉధృతి తగ్గడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

గురువారం మధ్యాహ్నం తర్వాత తిరిగొచ్చి ఇండ్లను, ఇంట్లోని వస్తువులను క్లీన్​చేసుకున్నారు. వరద నీరు వెళ్లిపోవడంతో ఎక్కడికక్కడ బురద నిలిచింది. కాగా మూసారాంబాగ్ బ్రిడ్జి ఓపెన్ చేయలేదు. బ్రిడ్జిపై చెత్త, బురద, రాళ్లు పేరుకుపోవడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది క్లియర్ చేసే పనిలో పడ్డారు. మంచిరేవుల ఓఆర్ఆర్ సర్వీస్​ రోడ్డు ధ్వంసంమూసీ వరదతో  నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని  మంచిరేవుల ఔటర్ రింగ్ రోడ్ కల్వర్టు వద్ద సర్వీస్ రోడ్  దెబ్బతింది. భారీ గుంతలు ఏర్పడ్డాయి.