భారీ వర్షాలతో హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల బాధ వర్ణనాతీతం. భారీ వరద ఉధృతితో మూసీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వర్షం తగ్గకపోవడంతో అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది.
ALSO READ :బంగాళాఖాతంలో అల్పపీడనం : 8వ తేదీ వరకు తెలంగాణ మొత్తం వర్షాలు
మూసారాం బాగ్ బ్రిడ్జి వద్ద వంతెనను ఆనుకొని నీరు ప్రవహిస్తోంది. అప్రమత్తమైన బల్దియా మూసీ పరివాహక ప్రాంతాలు అలర్ట్‌గా ఉండాలంటూ హెచ్చరిక జారీ చేసింది. జంట జలాశయాల నుంచి పెద్ద ఎత్తున వరదనీరు నదిలోకి విడుదల చేస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంటూ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.