
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ఫార్ములా–ఈ రేస్ మరోసారి హైదరాబాద్‌లో అలరించనుంది. ఫార్ములా–ఈ సిరీస్ 2024 సీజన్‌లో హైదరాబాద్‌కు ప్లేస్ దక్కింది. రేసు మరోసారి భాగ్యనగరంలో జరుగుతుందని ఆర్గనైజర్స్ గురువారం ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో రేసు నిర్వహిస్తామని తెలిపారు. ఇండియాలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఫార్ములా–ఈ రేస్ జరిగింది.
అయితే, 2024 ప్రాథమిక క్యాలెండర్‌లో హైదరాబాద్ లేకపోవడంతో -ఎలక్ట్రిక్ వెహికిల్స్ రేస్ సిటీకి తిరిగి వస్తుందో లేదో అనే సందేహాలను కలిగించింది. కానీ, ఎఫ్‌ఐఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తర్వాత ఫార్ములా ఈ వరల్డ్ చాపియన్‌షిప్ పదో సీజన్ హైదరాబాద్‌లో కూడా జరుగుతుందన్న స్పష్టత వచ్చింది. అలాగే, తొలిసారిగా షాంఘై నగరాన్ని కూడా రేసు ఆతిథ్య నగరాల్లో చేరింది.