
కోహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ములలో ఆదివారం బస్సు రన్నింగ్లో ఉండగా ముందు టైరు ఊడిపోయింది. స్థానికుల కథనం ప్రకారం.. కోహెడ నుంచి 12 మంది ప్రయాణికులతో మినీ బస్సు కరీంనగర్ వెళ్తోంది. నకిరేకొమ్ములకు రాగానే ముందు టైరు ఊడిపోయింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును అదుపు చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.