
కాజీపేట, వెలుగు: మావోయిస్ట్ అగ్రనేత మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం కాజీపేట మండలం టేకులగూడెంలో ముగిశాయి. గురువారం ఉదయం ఏసోబు డెడ్‌బాడీని టేకులగూడెంలోని ఆయన కొడుకు మహేశ్ చంద్ర ఇంటికి తీసుకువచ్చారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, ప్రజా ఫ్రంట్ జనగామ జిల్లా అధ్యక్షుడు పాతాళ విజయ్, మావోయిస్ట్ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర అధ్యక్షురాలు జన్ను శాంత, గాదె ఇన్నయ్య, ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్ గ్రామానికి వచ్చి ఏసోబు డెడ్‌బాడీ వద్ద నివాళి అర్పించారు. మావోయిస్ట్ పార్టీలో ఏసోబు ఎదిగిన తీరును వివరిస్తూ పౌరహక్కుల నేతలు పాటలు పాడారు. అనంతరం ఏసోబు అంత్యక్రియలు పూర్తి చేశారు.