భవిష్యత్‌‌ ఏఐ, రోబోలదే!.. జీవితాన్ని సులభతరం చేసేందుకు రెడీ అవుతున్న రోబోలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరిస్తుండడంతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అడ్వాన్స్డ్‌‌ టెక్నాలజీలతో  కొత్త ప్రొడక్ట్‌‌లను డెవలప్‌‌ చేస్తున్నాయి. యూఎస్‌‌లోని లాస్‌‌వేగాస్‌‌లో జరిగిన  కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్‌)  –2025 లో ఫ్యూచరిస్టిక్ ప్రొడక్ట్‌‌లను ప్రదర్శనకు ఉంచాయి. 

ఎగిరే కార్లు, నిళ్లలో కూడా మట్టి తవ్వగలిగే ఎక్స్‌‌కేవేటర్‌‌‌‌,  క్యూట్‌‌గా కనిపించే రోబో డాగ్‌‌,  రోబో నర్స్‌‌,  రోబో గర్ల్‌‌ఫ్రెండ్‌‌, పియానో వాయించే రోబో,  యంగ్‌‌గా కనిపించేలా చేసే  ఎల్‌‌ఈడీ మాస్క్‌‌ ఇలా చాలా ప్రొడక్ట్‌‌లు   వీక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని చూస్తే భవిష్యత్‌‌ ఎలా ఉండబోతుందా? అని కచ్చితంగా ఆలోచిస్తారు. ఈ నెల 7 నుంచి10 మధ్య జరిగిన సీఈఎస్‌లోని కొన్ని హైలెట్స్ కింద ఉన్నాయి.

రియల్‌‌బొటిక్స్‌‌  సంస్థ ‘ఎరియా’ పేరుతో  రోబో గర్ల్‌‌ఫ్రెండ్‌‌ను డెవలప్‌‌ చేసింది.  దీని ధర రూ.1.5 కోట్ల పైమాటే.   ఏఐతో పనిచేసే ఈ రోబో,  గర్ల్‌‌ఫ్రెండ్‌‌లా తోడుంటుంది.

నీళ్లలో  నిర్మాణాలను చేపట్టేందుకు కొమాట్సు  అడ్వాన్స్డ్‌‌ ఎక్స్‌‌కేవేటర్‌‌‌‌ను డెవలప్ చేసింది చంద్రునిపై కూడా ఈ ఎక్స్‌‌కేవేటర్‌‌‌‌ను  వాడొచ్చని చెబుతోంది.

సీఈఎస్‌‌ 2025 లో  రోబో డాగ్ సందడి చేసింది.  దీని పేరు జెన్నీ.  నిజమైన కుక్క మాదిరే  తోక ఊపుతుంది. కోప్పడుతుంది. కుక్కలా  ప్రవర్తిస్తుంది. దీనిని టామ్‌‌బాట్‌‌  డెవలప్ చేసింది.

వ్యాక్యూమ్ క్లీనర్లను తయారు చేసే షార్క్ సీఈఎస్‌‌ 2025 లో ఎల్‌‌ఈడీ ఫేస్ మాస్క్‌‌ను  ప్రదర్శనకు ఉంచింది.
ఈ మాస్క్ పెట్టుకున్న తర్వాత స్కీన్ కూల్‌‌గా మారుతుంది. యంగ్‌‌గా కనిపిస్తారని కంపెనీ చెబుతోంది. ఈ మాస్క్‌‌ను ‘క్రైయోగ్లో’ గా  పిలుస్తున్నారు.

పిల్లలను చూసుకోవడానికి  టీసీఎల్‌‌  ‘ఏఐ మీ’ పేరుతో ఓ క్యూట్ రోబోను డెవలప్ చేసింది. గుడ్లగూబల కనిపించే ఈ రోబో  చుట్టుపక్కలను  స్కాన్ చేయగలుగుతుంది. వీడియోలు, ఫోటోలు తీయగలుగుతుంది. సీసీ కెమెరాల కూడా పనిచేస్తుంది. 

చైనీస్ కంపెనీ  జిపెంగ్‌‌ ఏరో హెచ్‌‌టీ సీఈఎస్‌‌ 2025 లో  ‘మాడ్యులర్ ఫ్లైయింగ్ కారు’ ను ప్రదర్శనకు ఉంచింది. ఇది ఎలక్ట్రిక్ మినివ్యాన్‌‌లా ఉంటుంది.  ఈవీటీఓఎల్‌‌ (ఎలక్ట్రానిక్ వెర్టికల్ టేకాఫ్‌‌ అండ్ ల్యాండింగ్‌‌) టెక్నాలజీతో ఎగురుతుంది.