భవిష్యత్ అంతా టెక్నాలజీ.. టెక్స్ టైల్ రంగానిదే

భవిష్యత్ అంతా టెక్నాలజీ.. టెక్స్ టైల్ రంగానిదే
  • కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
  • మాదాపూర్​ నిఫ్ట్​లో ఘనంగా కాన్వొకేషన్ - ​ 2021

మాదాపూర్,వెలుగు: టెక్నికల్, టెక్స్ టైల్ రంగానికి మంచి డిమాండ్ ఉందని.. టెక్స్ టైల్ ప్రొడక్షన్ విభాగంలో కంపెనీలకు ఇన్సెంటీవ్స్ కూడా అందజేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం మాదాపూర్ లోని నిఫ్ట్  (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ)క్యాంపస్​లో కాన్వొకేషన్– 2021 ప్రోగ్రామ్ ఉత్సాహంగా​జరిగింది. కేంద్ర టెక్స్​టైల్​శాఖ సెక్రటరీ ఉపేంద్ర ప్రసాద్​సింగ్ తో కలిసి చీఫ్ గెస్టుగా హాజరైన కిషన్ రెడ్డి ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. గతేడాది పాసైన 233 మంది స్టూడెంట్లకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో  అగ్రికల్చర్ తర్వాత హ్యాండ్లూమ్ టెక్స్ టైల్ విభాగం ఎంప్లాయ్ మెంట్ లో రెండోస్థానంలో ఉందన్నారు.  భూదాన్ పోచంపల్లి చీరలకు, హ్యాండీ క్రాఫ్ట్స్ కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. నిఫ్ట్ స్టూడెంట్లు తయారు చేసిన డిజైన్లు, హ్యాండీక్రాఫ్ట్స్ ను క్యాంపస్ ఆవరణలో ప్రదర్శించారు. కార్యక్రమంలో నిఫ్ట్ డెరెక్టర్ జనరల్ శాంతమను, ప్రొఫెసర్ డా. మాలిని, అకడమిక్ డీన్ ప్రొఫెసర్ డా. వందనా నారంగ్, ఫ్యాకల్టీ, స్టూడెంట్లు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తల కోసం..

మోడీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రత్యేక హోదా ఇచ్చినం

అధికారిక లాంఛనాలతో రాహుల్ బజాజ్ అంత్యక్రియలు