హయత్నగర్లోని క్రీడా రీసెర్చ్ సెంటర్లో జీ20 బృందం పర్యటన

హయత్నగర్లోని క్రీడా రీసెర్చ్ సెంటర్లో జీ20 బృందం పర్యటన

రంగారెడ్డి జిల్లా : హయత్ నగర్ లోని క్రీడా రీసెర్చ్ సెంటర్ లో జీ20 బృందం పర్యటించింది. మారుతున్న వాతావరణం తట్టుకునే అమలు చేస్తున్న వ్యవసాయ పద్ధతులను పరిశీలించింది. గత నాలుగు రోజులుగా నోవాటెల్ హోటల్ లో వర్క్ షాప్ నిర్వహిస్తుండగా.. క్రీడా రీసెర్చ్ సెంటర్ లో సెప్టెంబర్ 6వ తేదీ  6 మంది డెలిగేట్స్ ఫీల్డ్ విజిట్ చేశారు. ఇక్కడి వ్యవసాయ పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సదస్సులో వాతావరణ మార్పులకు సంబంధించిన వ్యవసాయ పరిశోధనలు, వివిధ  సమస్యలపై అభిప్రాయాలు వెల్లడించారు. 

మూడు రోజుల పాటు నిర్వహించిన సదస్సులో వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయ అవసరాలు, కేస్ స్టడీస్, అనుభవాలు, ఫైనాన్స్ సంస్థాగత అవసరాలకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. జీ20 దేశాల ప్రతినిధులు వాతావరణాన్ని తట్టుకుని పంటలు పండించే పద్ధతులపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.