హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) మూడో అంచె పోటీలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం రెడీ అయ్యింది. నేటి నుంచి వచ్చే నెల 10 వరకు ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్.. బెంగాల్ వారియర్స్‌తో తలపడుతుంది. అయితే ఇప్పటివరకు బెంగళూరు, పుణెలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 13 పరాజయాలు చవిచూసిన టైటాన్స్ సొంతగడ్డపై పుంజుకుంటుందా? చూడాలి. మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ నగరంలో కబడ్డీ మ్యాచ్‌లకు నగరం ఆతిథ్యమిస్తుండటంతో ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యే చాన్స్ ఉంది.
హైదరాబాద్‌లో ఆడటం తమకు లాభిస్తుందని టైటాన్స్ కోచ్ వెంకటేష్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు ముంబై ఆతిథ్యమివ్వనుంది. డిసెంబర్ 13న ఎలిమినేటర్–1, 2.. 15వ తేదీన సెమీఫైనల్–1, 2 మ్యాచ్‌లు జరుగుతాయి. 17వ తేదీన గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది.