సాగర్‌‌‌‌ గేట్లు మళ్లీ ఓపెన్.. 16 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

సాగర్‌‌‌‌ గేట్లు మళ్లీ ఓపెన్.. 16 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

హాలియా, వెలుగు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉధృతంగా పారుతోంది. నాగార్జునసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌కు ఎగువ నుంచి 1,72,41 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 16 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,29,440 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రం వరకు 589.90 అడుగుల (311.7462) నీటిమట్టం నమోదైంది. సాగర్‌‌‌‌ నుంచి కుడి కాల్వకు 8,490 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 2,608, విద్యుత్‌‌‌‌ ఉత్పత్తికి 29,273, ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీకి 1,800, వరద కాల్వకు 600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.