మళ్లీ మొరాయించిన కడెం గేట్లు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్లు మళ్లీ మొరాయించాయి. మొత్తం 18 గేట్లకు గాను 14 గేట్లు మాత్రమే ఓపెన్ అయ్యాయి. శుక్రవారం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అన్ని గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే ఆరు గేట్లు ఓపెన్ కాలేదు. అతికష్టం మీద మాన్యువల్ గా రెండు గేట్లను ఓపెన్ చేయగా.. 2, 3, 12, 18వ గేటు మాత్రం తెరుచుకోలేదు. 

కాగా, పోయినేడాది జులై 12న భారీగా వరద వచ్చినప్పుడు కూడా గేట్లు మొరాయించాయి. అప్పుడు పూర్తిగా కడెం ప్రాజెక్టు తెగిపోతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే వరద తగ్గడంతో ప్రమాదం తప్పింది. ఆ టైమ్ లో ప్రాజెక్టుకు రిపేర్లు చేయాలని, అధికారులు ఆగమేఘాల మీద ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఏడాది గడిచినా పూర్తిస్థాయిలో రిపేర్లు చేయలేదు.