
డెలాయిట్ అంచనా
న్యూఢిల్లీ: గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మందగించినా ఇండియా స్ట్రాంగ్‌గా ఉందని డెలాయిట్ సౌత్ ఏషియా సీఈఓ రోమల్ శెట్టి అన్నారు. ఇండియా జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–7.1 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్‌లో ఉందని, రూరల్ డిమాండ్ పుంజుకుందని, వెహికల్స్ సేల్స్ మెరుగుపడ్డాయని వివరించారు. ‘అవకాశాలు, అడ్డంకులు రెండూ ఉన్నాయి. గ్లోబల్‌గా ఏం జరిగినా ఇండియా బెటర్ పొజిషన్‌లో ఉంది. అలా అని గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ నుంచి ఇండియా వేరైందని చెప్పలేం’ అని శెట్టి పేర్కొన్నారు.
మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వెస్ట్రన్ దేశాల్లో గ్రోత్ తగ్గడంతో జీడీపీ వృద్ధి నెమ్మదిస్తుందని అన్నారు. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ 6.7 శాతం వృద్ధి చెందుతుందని డెలాయిట్ అంచనా వేస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం గ్రోత్ రేట్‌ను నమోదు చేశాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే పెర్ క్యాపిటా ఇన్‌కమ్ ప్రస్తుతం ఉన్న 2,500 డాలర్ల నుంచి 20 వేల డాలర్లకు పెరగాలన్నారు.