మొక్కుబడిగా మండల సభ

బోధన్​, వెలుగు: బోధన్​ మండల సర్వసభ్యసమావేశం అరగంటలోనే ముగించి  అధికారులు  చేతులు  దులుపుకున్నారు. బోధన్​ మండల సర్వసభ్యసమావేశం గురువారం  ఎంపీపీ  బుద్దె సావిత్రి  అధ్యక్షతన నిర్వహించారు.  మండలంలోని సర్పంచులకు, ఎంపీటీసీలకు,  అధికారులకు  సమాచారం అందించినా హాజరుకాలేదని ఎంపీడీవో పర్వన్న తెలిపారు.  మండలంలోని  18మంది ఎంపీటీసీలకు  9 మంది, 38 మంది సర్పంచ్​లకు గాను ఆరుగురు  సర్పంచులు హాజరయ్యారు. పేరుకు 9మంది ఎంపీటీసీలు వచ్చినా సభలో  నలుగురు ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. 17శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు హాజరు కావలసిఉండగా, అందులో ఆరు శాఖల అధికారులు వచ్చారు.  మిగతశాఖలకు చెందిన కిందిస్థాయి  సిబ్బంది వచ్చారు.  మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండలసభకు అధికారులు నామమాత్రంగా నిర్వహించి  చేతులు దులుపుకుంటున్నారని మండల  ప్రజలు ఆరోపిస్తున్నారు.  ప్రతిసారి మండలసభను నామమాత్రంగానే నిర్వహించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని సభ్యులు ఆరోపించారు.  గురువారం నిర్వహించిన మండలసభలో విద్యుత్​శాఖ  నుంచి టౌన్​, రూరల్​ ఏఈలు ఇద్దరు హాజరు కావలసి  ఉండగా టౌన్​ఏఈ గంగారాం మాత్రమే  వచ్చారు.  గ్రామాల్లోని  కరెంటు  సమస్యలు సర్పంచ్​లు చెప్పితే తనకు సంబంధంలేదని టౌన్​ఏఈ తెలిపారు.  అలాగే అగ్రికల్చర్​ అధికారి రాలేక ఏఈవోను  పంపించారు. రైతుల బీమాపై అడిగితే  తనకు తెలియదని ఏఈవో  తెలిపారు.  మహిళసంఘాలకు సంబంధించిన మండల అధికారి రాకుండా సీసీని పంపించారు. మహిళసంఘాలకు సంబంధించిన పావలా  వడ్డీ రాలేదని సర్పంచ్​లు అడిగితే సీసీ వద్ద ఎలాంటి సమాచారంలేదు. సమావేశంలో మండల వైస్​ ఎపీపీ  కోట  గంగారెడ్డి, ఎంపీడీవో పర్వన్న, ఎంపీవో మధుకర్​ పాల్గోన్నారు.

ALSO READ:-తెలంగాణలో ప్రజా దర్బార్ ఎలా, ఎప్పుడు పుట్టింది.. నాగోబా జాతరతో లింకేంటీ..?