దండకారణ్యంలో మారణహోమం ఆపాలి

దండకారణ్యంలో  మారణహోమం ఆపాలి

దండకారణ్యంలో జరుగుతున్న  మారణహోమంలో చంపబడినవారిలో  ఇరువైపులా  గిరిజన తెగలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు.  నక్సల్స్ తమ సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ట్రైబల్స్​ను తమ దళాలలోకి తీసుకున్నారు.  మరోవైపు ప్రభుత్వం కూడా వారిని ప్రాథమిక సాయుధ సిబ్బందిగా దళాలకు వ్యతిరేకంగా గిరిజనులను నియమించింది.  ట్రైబల్స్​ దానిని తమకు ఉపాధిగా భావిస్తున్నారు. 

ప్ర భుత్వం తిరుగుబాటుదార్లను అణచివేయాలి  కాబట్టి రెబల్స్​ అణచివేతకు కేంద్రానికి మార్గం సుగమం అయింది.  భారతదేశం  సాయుధ పోరాట వ్యాప్తికి అనుకూలంగా లేదు. అందుకే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉపసంహరించుకున్న తర్వాత కమ్యూనిస్టులు ఎన్నికల మార్గాన్ని ఎంచుకోవలసి వచ్చింది. సాయుధ పోరాట కాన్సెప్ట్ తెలంగాణలోనే పుట్టిందని మనం గుర్తుంచుకోవాలి. శ్రామిక, కార్మిక శ్రమదోపిడీని అరికట్టడానికి ప్రతిఘటన అంతర్యుద్ధ కాలంలోనే  ప్రారంభమైంది, ముఖ్యంగా 1930ల రెండో భాగం తర్వాత కమ్యూనిస్టులు 1943లో ఏర్పడ్డారు.  1945లో జరిగిన యుద్ధాలలో కమ్యూనిస్టులు చురుకుగా పాల్గొన్నారు. అనంతరం దానిని సాయుధ పోరాటంగా మార్చారు.

సాయుధ పోరాటం

అధికార బదిలీ  కోసం చేసిన పోరు ఆతర్వాత అది భూమికోసం పోరాటంగా మారింది. అందువలన స్వతంత్ర ప్రభుత్వం ముందు భూ సంస్కరణ ముఖ్యమైన సమస్యగా మారింది. రైతులు యుద్ధాల నుంచి వైదొలిగారు.   కానీ, సాయుధ పోరాటం పట్ల ఆకర్షితులైనవారు ‘రివిజనిజం’తో  విభేదించారు. చివరికి వారు 1970 తర్వాత సాయుధ పోరాటం ప్రారంభించారు. వారికి రైతుల నుంచి మద్దతు లభించకపోవడంతో గిరిజన ప్రాంతాలకు తరలివెళ్లారు. తిరుగుబాటుదారులు ‘తుపాకీ గొట్టం ద్వారా అధికారం లభిస్తుంది’ అని ప్రకటించారు.  ప్రభుత్వం బలహీనంగా ఉన్న అత్యంత వెనుకబడిన ప్రాంతాల నుంచి విప్లవం ప్రారంభమైంది. విప్లవకారులు  మార్క్సిజం,  లెనినిజాన్ని ఆహ్వానించారు. బోల్షెవిక్ మార్గదర్శకంలో పట్టణ ప్రాంతాలలోని రష్యన్ కార్మిక వర్గం రాజభవనం, రేడియో స్టేషన్‌‌‌‌ను స్వాధీనం చేసుకుంది.  జార్‌‌‌‌ ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు భూస్వాములకు వ్యతిరేకంగా సంఘటితమయ్యారు. ఆ విధంగా మొత్తం రష్యా  జారిస్ట్ రష్యాకు వ్యతిరేకంగా మారింది. ఆ విధంగా విప్లవం విజయవంతమైంది. కార్మికవర్గం దానిని విజయపథంలో నడిపించింది. రైతులు బోల్షెవిక్‌‌‌‌ల మార్గాన్ని అనుసరించారు.

రైతులు, కార్మికులు ప్రజాస్వామ్యానికి వెన్నెముక

భారతదేశంలో కార్మికులతోపాటు రైతులు ఇరువర్గాలు తమ డిమాండ్ల కోసం ఎన్నికల మార్గాన్ని ఎంచుకున్నారు, అందువల్ల  ప్రజాస్వామ్య మార్గం తప్ప వేరే విప్లవాత్మక పరిస్థితి లేకుండాపోయింది. దీంతో అసంతృప్తి చెందిన విప్లవకారులు వెనుకబడిన ప్రాంతాలకు తరలిపోయారు.  భారతీయుల  మనస్సులు ఇప్పటికీ బ్రాహ్మణీయంగా ఉన్నాయని గుర్తుంచుకోవాలి, వారు రామాయణం, భగవద్గీత మాత్రమే కాకుండా  మార్క్సిజం,  లెనినిజం  కూడా పఠిస్తారు.  అసంతృప్తి చెందినవారు తమను తాము మార్క్సిస్ట్- , లెనినిస్టులుగా పిలుచుకుంటారు.  వారి పార్టీలను ఎంఎల్​ పార్టీలు అని పిలుస్తారు. వీటికి సంబంధించిన చాలావరకు రీసెర్చ్​ మెటీరియల్​ ప్రస్తుతం   అందుబాటులో ఉంది. భారతీయ రైతులు,  కార్మికులు భారత  ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా మారారు.  సోషల్​ జస్టిస్​ పేరిట తమకు సముచిత స్థానాన్ని కోరుతూ సామాజిక న్యాయం అనే భావనతో దిగువ కులాలు చాలా క్రీయాశీలకంగా మారాయి. వారిని ప్రజాస్వామ్య మార్గంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం వారితో చర్చలు ప్రారంభించింది.

మావోయిస్టులను మోదీ చర్చలకు ఆహ్వానించాలి

విప్లవ మార్గం పట్టిన క్యాడర్​కు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది.  ప్రభుత్వం నేరుగా మావోయిస్టులను యుద్ధం ప్రకటించదు, మరో మాటలో చెప్పాలంటే  ట్రైబల్స్​కు,  ప్రజలకు, వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి ప్యాకేజీని అందిస్తుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడం, అవసరమైతే మేధావులు,  రాజకీయ నాయకుల సహాయంతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం హోం మంత్రిత్వ శాఖ ప్రాథమిక బాధ్యతగా గుర్తించాలి. చారిత్రాత్మకంగా వారసత్వంగా వచ్చిన ఈ సాయుధ పోరాటాల పరిస్థితిని చర్చల ద్వారా పరిష్కరించడానికి  ప్రధాని మోదీ కృషి చేయాలి.  ప్రజాస్వామ్యాన్ని విస్తరించడానికి మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలి.  బీజేపీ నక్సలైట్లతో చర్చలు ప్రారంభిస్తుందని ఆశిస్తున్నాను.

- తిరుమలి, ప్రొఫెసర్