హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న కిడ్నాప్ కు గురైన బాలిక ప్రగతి (6) ఆచూకీ లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుమూల్ నర్వ గ్రామంలో కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించిన పోలీసులు. హైదరాబాద్ అబిడ్స్ లో ఆడుకుంటున్న చిన్నారిని ఆటోలో ఎక్కించుకుని కిడ్నాప్ చేసిన నిందితుడు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు.
సిటీ అంతా హై అలర్ట్ ప్రకటించారు. గల్లీగల్లీలో గస్తీ నిర్వహించి కిడ్నాపర్ ఆచూకీ రాబట్టారు. అనంతరం కిడ్నాపర్ ను ట్రేస్ చేసి రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుమూల్ నర్వ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. బాలిక సురక్షితంగా ఉందని పోలీసులు తెలిపారు. బాలికను, నిందితున్ని పోలీసులు అబిడ్స్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు.