వనపర్తి, వెలుగు: దేశంలోని రైతులందరినీ ఏకం చేసి రైతు రాజ్యం తేవడమే బీఆర్ఎస్లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్‌ఆఫీస్‌లో కలిసిన కర్ణాటక రైతు ప్రతినిధులతో ‘బీఆర్ఎస్’ పై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఎనిమిదేండ్లుగా పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు రాష్ట్రం వస్తదని ఎవరూ అనుకోలేదని, కానీ కేసీఆర్ సాధించి చూపించారన్నారు. బీఆర్ఎస్లో చేరేందుకు పలు రాష్ట్రాల్లో లీడర్లు ఆసక్తి చూపుతున్నారని అందులో భాగంగానే కర్ణాటక లోక్ జనశక్తి (పాశ్వాన్ ) రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు జి.వెంకట్ రెడ్డి, ఎల్ జేపీ కర్ణాటక యూత్ ప్రెసిడెంట్ నారాయణ కర్లి తదితరులు వనపర్తి వచ్చారన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ సమక్షంలో రాయచూర్‌లో బీఆర్ఎస్ లో భారీ చేరికలు ఉంటాయన్నారు.
ఈదుల చెరువు లిఫ్ట్ ప్రారంభం
వనపర్తి సమీపంలో ఈదుల చెర్వు లిఫ్ట్ ను నందిమల్ల గడ్డ వద్ద మోటర్లకు పూజలు చేసి మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. 300 ఎకరాలకు ఈ లిప్టు ద్వారా సాగునీరు అందుతుందని ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం వనపర్తి లోని పలు చర్చిల్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరై కేక్ కట్ చేసి క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు.
టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్లు
జిల్లాలోని టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్లను అందించేందుకు మంత్రి సి. నిరంజన్ రెడ్డి ముందుకు వచ్చారు. గురువారం వనపర్తిలోని ఎమ్మెల్యే ఆఫీస్‌లో రోగులకు గుడ్లు, న్యూట్రిషన్ కిట్లను స్వచ్ఛందంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్స్అందిస్తున్నానని చెప్పారు. పౌష్ఠికాహారంతో పాటు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తే టీబీని నిర్మూలించవచ్చన్న నమ్మకం తనకు ఉందన్నారు. టీబీ రోగులను కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేయొద్దని, వివక్ష చూపడం వల్ల మానసిక బాధతో చాలా మంది చనిపోతున్నారన్నారు. డీఎంహెచ్ వో డాక్టర్ రవిశంకర్, పీవో సాయినాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
కమిట్మెంట్తో పనిచేస్తేనే గుర్తింపు
గద్వాల, వెలుగు: డ్యూటీలో కమిట్మెంట్ తో పనిచేస్తేనే ప్రజల్లో గుర్తింపు వస్తుందని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. గురువారం ఎస్పీ ఆఫీస్‌లో పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ ఆఫీసర్లకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు కమిట్మెంట్ తో సేవలు చేస్తే గుర్తింపు ఆటోమేటిక్ గా వస్తుందన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షల శాతాలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రంగస్వామి ఏవో సతీశ్ కుమార్, ఎస్బీ శ్రీనివాసులు, సీఐలు చంద్రశేఖర్, సూర్య నాయక్ పాల్గొన్నారు.
కేంద్రం సొమ్ముతో కేసీఆర్ సోకులు
పానగల్, వెలుగు: కేంద్రం సొమ్ముతో కేసీఆర్సోకులు పడుతున్నారని, బీజేపీ ప్రభుత్వంతోనే గ్రామాల్లో సుస్థిర పాలన సాధ్యమవుతోందని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న రఘునందన్‌రావు గురువారం పానగల్ లో బీజేపీ జెండాను ఎగురవేసి అనంతరం నిర్వహించిన ధూం ధాం సభలో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఎల్లేని సుధాకర్ రావు ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రమంత్రులను రప్పించి సోమశిల సిద్ధేశ్వర బ్రిడ్జి, నేషనల్హైవే నిర్మాణానికి ఫండ్స్శాంక్షన్చేయించారన్నారు. వచ్చే ఎన్నికల్లో కొల్లాపూర్ ప్రజలు సుధాకర్‌రావుకు అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని డెవలప్చేస్తారన్నారు. బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి, లీడర్లు బి.కృష్ణ, పరుశురాం, రామన్ గౌడ్, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి రోజా రమణి తదితరులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయాలి
మహబూబ్‌నగర్‌రూరల్/ గద్వాల/ మక్తల్, వెలుగు: ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న స్టూడెంట్ల ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్లను వెంటనే రిలీజ్చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పాలమూరు యూనివర్సిటీ, గద్వాల జిల్లా కేంద్రంలో, మక్తల్పట్టణంలో ఆందోళనకు దిగారు. ధర్నాలు చేసి అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేషనల్కమిటీ మెంబర్స్వామి మాట్లాడుతూ రూ. 2,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ లను శాంక్షన్చేయకుండా స్టూడెంట్ల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్టూడెంట్ల సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని బీజేపీ లీడర్లు హెచ్చరించారు. ఏబీవీపీ స్టేట్జాయింట్సెక్రటరీ సతీశ్, మక్తల్టౌన్ప్రెసిడెంట్వంశీ, లీడర్లు నరేశ్, సురేశ్, మనోజ్ కుమార్, అశోక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విభేదాలు పరిష్కరించుకుంటే అధికారం పక్కా
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటే జిల్లాలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పక్కా అని డీసీసీ ప్రెసిడెంట్వంశీకృష్ణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌నేత నాగం జనార్దన్ రెడ్డి ఇంట్లో ‘హాత్ సే హాత్ జోడో పాదయాత్ర’ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ జనవరి 26 నుంచి చేపడుతున్న పాదయాత్రను సక్సెస్చేసేందుకు కాంగ్రెస్శ్రేణులు కృషి చేయాలన్నారు. జిల్లాలో టీఆర్ఎస్ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ.. చేస్తున్న కార్యక్రమాలకు మంచి స్పందన వస్తుందన్నారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు జగదీశ్వర్ రావు, నాగం శశిధర్ రెడ్డి, అర్థం రవి, రోహిణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుల సేవలో ముందున్న బాదేపల్లి పీఏసీ
జడ్చర్ల టౌన్, వెలుగు: బాదేపల్లి సహకార సంఘం రైతుల సేవలో ముందున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని నాగసాల సమీపంలో బాదేపల్లి సింగిల్ విండో పరిధిలో రూ.1.87 కోట్లతో 25వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల భారీ గోదాం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా
లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అన్ని రకాల లోన్లతో పాటు విత్తనాలు, సకాలంలో అందజేస్తుందన్నారు. అంతకుముందు పట్టణంలోని చంద్రగార్డెన్ లో జడ్చర్ల పరిధిలోని ఆయా గ్రామాలు, పట్టణానికి చెందిన 130 మంది లబ్ధిదారులకు రూ.1.35 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.