
హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్ ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. మార్చి నెలలోనే బోర్డు మీటింగ్ నిర్వహించాల్సి ఉన్న తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో వాయిదా వేశారు. రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులు, బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత, బోర్డుకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.