వేలానికి రానున్న ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. రూ.300 కోట్ల నుంచి రూ.450 కోట్ల ధర పలికే చాన్స్

వేలానికి రానున్న ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. రూ.300 కోట్ల నుంచి రూ.450 కోట్ల ధర పలికే చాన్స్

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరుదైన వజ్రం ‘గోల్కొండ బ్లూ’ వేలానికి రానుంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఈ వజ్రం ఉండేది. 23.24 క్యారెట్ల విలువైన ఈ వజ్రాన్ని మే 14న జెనీవాలో జరిగే ‘‘ క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్’’ సేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేలం వేయనున్నారు.  వేలంలో దీనికి దాదాపుగా రూ.300 కోట్ల నుంచి రూ.450కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉన్నట్టు క్రిస్టీస్ సంస్థ అంచనా వేస్తోంది. రాజ వారసత్వం, అసాధారణ రంగు, పరిమాణంతో ‘ది గోల్కొండ బ్లూ’ ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలిచిందని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఓ ప్రకటనలో తెలిపారు.