కూకట్ పల్లి JNTUలో ఘనంగా గోల్డెన్ జూబ్లీ ముగింపు వేడుకలు 

కూకట్ పల్లి JNTUలో ఘనంగా గోల్డెన్ జూబ్లీ ముగింపు వేడుకలు 

కూకట్ పల్లిలోని JNTUలో గోల్డెన్ జూబ్లీ ముగింపు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైస్ ఛాన్స్ లర్ కట్టా నరసింహారెడ్డి అధ్యక్షతన 3 రోజులపాటు వేడుకలు జరగనున్నాయి. ఈసందర్భంగా మెరిట్ స్టూడెంట్స్ కి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ కిదాంబి, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు విద్యార్థులకు అవార్డులు అందించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఆ దిశగా అడుగులు వేయాలన్నారు కిదాంబి శ్రీకాంత్. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని మర్చిపోవద్దు అన్నారు.  చదువుతోపాటు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలపైనా దృష్టి పెట్టాలన్నారు నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు. 

జేఎన్టీయూ విద్యార్థులు సినిమా ఇండస్ట్రీలోనూ ఉన్నారని చురుకుగా ముందుకు సాగుతున్నారని దగ్గుపాటి సురేష్ బాబు గుర్తు చేశారు.  ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పలు కళాశాలలకు చెందిన నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.