రన్నింగ్‌‌‌‌‌‌‌‌లోనే విడిపోయిన గూడ్స్ వ్యాగన్లు.. తప్పిన పెను ప్రమాదం

తాండూరు, వెలుగు: రన్నింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న గూడ్స్‌‌‌‌‌‌‌‌ రైలు నుంచి కొన్ని వ్యాగన్లు విడిపోయాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా రేపల్లెవాడ–తాండూరు స్టేషన్ల మధ్య మంగళవారం జరిగింది. బల్లార్షా నుంచి కాజీపేట వైపు వెళ్తున్న గూడ్స్‌‌‌‌‌‌‌‌ రైలు రేపల్లెవాడ సమీపంలోకి చేరుకోగానే వ్యాగన్ల మధ్య లింక్‌‌‌‌‌‌‌‌ తెగింది. గమనించిన గార్డ్‌‌‌‌‌‌‌‌ వెంటనే డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు సమాచారం ఇచ్చాడు. అతడు రైలును నిలిపివేసి సమీపంలోని రేచిని రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే సిబ్బందితో కలిసి వచ్చి వ్యాగన్లను తిరిగి లింక్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఆఫీసర్లు చర్యుల తీసుకున్నారు.