ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఆరున్నరేండ్లు గడిచినా.. ఉద్యమ ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేర లేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సమాజం ఏకమై కొట్లాడింది. కానీ, నీళ్ల పేరుతో సర్కారు పెద్దలు జేబులు నింపుకుంటున్నారు. ప్రాజెక్టులకు అవసరమైన దానికంటే వేల కోట్ల రూపాయల అంచనాలు పెంచుతూ నిధులన్నీ దుర్వినియోగం చేస్తున్నారు. ఇక స్టూడెంట్లు, నిరుద్యోగులు తమ చదువులు, జీవితాలను త్యాగం చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని, తమ జీవితాలు బాగుపడతాయని ఆశపడ్డారు. ఇప్పుడు వారి గోస ఎవరికీ పట్టడం లేదు. గులాబీ బాస్ కు వారు అసలు కనిపించడం లేదు. తన కుటుంబంలో అందరికీ మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎంపీగా ఓడితే ఎమ్మెల్సీగా ఉద్యోగం ఇచ్చుకున్నారు. చివరి దాకా కొట్లాడిన ఉద్యమకారుల సంక్షేమం గురించి ఊసేలేదు. అసలు ఉద్యమ ఆకాంక్షలే పాలకులకు గుర్తులేవు.
తెలంగాణ ఏర్పడి ఇన్నేండ్లవుతున్నా ఉద్యమకారులపై సీమాంధ్ర ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తేయలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులపై నమోదైన కేసులు మాత్రమే స్పెషల్ జీవో ద్వారా ఎత్తేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 3,500 మంది జైలుకు వెళ్లారు. 2,890 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిని కనీసం ఉద్యమకారులుగా గుర్తించే పరిస్థితి లేదు. ఉద్యమం సమయంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి సంఖ్య 1,230. ఇందులో 1,089 మంది అమరులు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోయారో పూర్తి వివరాలతో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారు ఒక నివేదిక తయారు చేశారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది 419 మందినే. అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. 80 మంది అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. 1969లో 369 మంది అమరులైతే సర్కార్ గుర్తించింది 270 మందినే. వారి కుటుంబాల వివరాలు లేవంటూ చేతులెత్తేసింది.
జర్నలిస్టులకు గుర్తింపు లేదు
తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటేందుకు జర్నలిస్టులు రాత్రనక పగలనక శ్రమించారు. యాజమాన్యాలు వద్దంటున్నా, వారిని ఒప్పించి తెలంగాణ ప్రజల గుండె చప్పుడు వినిపించారు. ఉద్యమంలో ఎంతో మంది జర్నలిస్టులకు గాయాలయ్యాయి. మరెందరో లాఠీ దెబ్బలు తిన్నారు. కేసులు కూడా భరించారు. ఇంత చేసినా జర్నలిస్ట్ లకు సొంత రాష్ట్రంలో ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదు. హైదరాబాద్ తోపాటు జిల్లాల్లోనూ ఇండ్ల స్థలాలు, త్రిబుల్ బెడ్రూం ఇండ్లు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు అందరికీ ఇస్తామని రాష్ట్రం వచ్చిన ఏడాదే టీయూడబ్ల్యూజే మీటింగ్ లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెండుసార్లు గద్దెనెక్కినా.. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు మాత్రం మరిచాడు. ఇండ్ల సంగతి వదిలేస్తే వారి సంక్షేమంపైనా చప్పుడు చేయడం లేదు.
ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమ
తెలంగాణ రాష్ట్రం కోసం 42 రోజులు సకల జనుల సమ్మె చేసి ఉమ్మడి సర్కార్ మెడలు వంచిన ప్రభుత్వ ఉద్యోగుల త్యాగాలు ఇప్పుడు సీఎంకు కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచుతామన్న సీఎం కేసీఆర్.. ఆ హామీనే మర్చిపోయారు. ఆరేండ్లయినా పీఆర్సీ మాటలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఉద్యోగులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇదంతా ఎన్నికల స్టంట్ తప్ప మరొకటి కాదు. కేసీఆర్ ని ఉద్యోగులు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బరిగీసి కొట్లాడిన లాయర్లకు కూడా సరైన న్యాయం జరగలేదు.
ఆంధ్రోళ్లకే అన్ని కాంట్రాక్టులు
ఆంధ్రా పెట్టుబడిదారులకు కాంట్రాక్టులు అప్పజెప్పి తెలంగాణ సంపదను దోచిపెడుతున్నారు. రూ.40 వేల కోట్లతో నిర్మిస్తామని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.120 కోట్లకు పెంచి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు. మిషన్ భగీరథ పేరుతో పాత వాటర్ ట్యాంక్ లకు రంగులు వేసి కొత్తవిగా చెప్పి మొత్తం నిధులను టీఆర్ఎస్ నేతలు తమ జేబులో వేసుకున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టారు. రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన సబ్బండ వర్గాలు ఇప్పుడు సీఎంకు కనిపించడం లేదు. సర్వం కోల్పోయిన ఉద్యమకారులను సొంత రాష్ట్రంలో కూడా గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండడం బాధాకరం. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లు ఇవ్వాలి. నెలకు రూ.20 వేల గౌరవ వేతనం, హెల్త్ కార్డులు ఇవ్వాలి.
ఎన్నికలు వస్తేనే సంక్షేమం
ఎన్నికలు వచ్చినప్పుడే టీఆర్ఎస్ సర్కారుకు సంక్షేమం గుర్తొస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్ వరద బాధితులకు ఇంటికి రూ.పది వేల నష్టపరిహారం ప్రకటించారు. ఈ మొత్తం వారికి ఇచ్చారా అంటే అదీ లేదు. కొంత టీఆర్ఎస్ కార్యకర్తలు, ఇంకొంత ఆ పార్టీ కార్పొరేటర్ల జేబుల్లోకి వెళ్లింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఈ పరిహారం ఇవ్వొద్దని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. కానీ వరద సాయాన్ని బీజేపీ వాళ్లు అడ్డుకున్నారని, ఎన్నికల తర్వాత బాధిత కుటుంబాలకు రూ.10 వేలు ఖాతాలో జమ చేస్తామని సర్కార్ ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయి నెల రోజులు దాటినా పరిహారం గురించి టీఆర్ఎస్ మాట్లాడడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 23 లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. గ్రామాల్లో ఎన్నికలు లేకపోవడంతో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు.
మూతపడ్డ వేలాది సర్కారీ స్కూళ్లు
టీచర్–స్టూడెంట్ రేషియో పేరుతో ఎనిమిది వేల ప్రభుత్వ పాఠశాలలను సర్కారు మూసేసింది. రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు కొత్తగా ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకూ ఒక్క రెగ్యులర్ పోస్ట్ నింపలేదు. రాష్ట్రంలోని 64 ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటు పరం చేశారు. దీనివల్ల బ్యాక్ లాగ్ పోస్టులు వెనక్కి వెళ్లిపోయాయి. ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేసే డిగ్రీ కాలేజ్ రెగ్యులర్ లెక్చరర్లను ప్రభుత్వ కాలేజీలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ చర్య వల్ల ఇప్పటివరకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో ఉన్న లెక్చరర్ల పోస్టులు చాలావరకు నిండిపోయాయి. ఇది నిరుద్యోగుల పాలిట శాపమే.
యూనివర్సిటీలను చంపేస్తున్నరు
ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులివ్వకుండా వాటిని చంపేస్తున్నారు. వాటిని బొంద పెట్టడం ఒక్కటే మిగిలి ఉంది. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలోనే 1,650 మంది ప్రొఫెసర్లు అవసరం ఉండగా.. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నది 380 మంది మాత్రమే. తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేసిన ఉస్మానియా వర్సిటీకి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన బహుమతి ఇది. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు రూ.200 కోట్ల నిధులు ఇస్తామని ప్రకటించిన సర్కార్ రూ.50 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ప్రైవేట్ యూనివర్సిటీలను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తూ పేదలకు చదువును దూరం చేస్తోంది. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ పెట్టుకున్నాడు. గ్రాడ్యుయేట్ల ఓట్లతో గెలుపొంది తర్వాత తరం గ్రాడ్యుయేట్లు, పేదలకు చదువును దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఉద్యోగాల భర్తీ అని సర్కార్ చెప్పే వంచన మాటలను స్టూడెంట్లు, నిరుద్యోగులు, తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని గులాబీ నేతలు గుర్తించాలి. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న అన్ని కేసులను బేషరతుగా ఎత్తేయాలి. ప్రభుత్వ శాఖల్లోని 2 లక్షల 90 వేల ఖాళీలను నిజాయితీగా భర్తీ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. లేదంటే ఓటు రూపంలో వేటు తప్పదని గుర్తించాలి. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చి, ఉద్యమకారుల సంక్షేమం కోసం పాటుపడాలి. లేదంటే ఉప్పెనలా వస్తున్న నిరసనలతో టీఆర్ఎస్ సర్కార్ గద్దె దిగడం ఖాయం.
ఉద్యోగాల భర్తీ.. ఎన్నికల స్టంట్
త్వరలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇటు హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్, అటు నల్గొండ–వరంగల్–ఖమ్మం ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో అక్కడ కూడా ఉప ఎన్నిక జరగనుంది. మరోవైపు వరంగల్, ఖమ్మం నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకునే సీఎం కేసీఆర్ 50 వేల ఉద్యోగాల భర్తీ పేరుతో మరో వంచనకు పావులు కదుపుతున్నారు. ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు పీఆర్సీ వల విసురుతున్నారు. ఉద్యోగులు అడగకుండానే రిటైర్మెంట్ వయసు పెంచుతామని ప్రకటించారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు పెంచడం కాదు కావాల్సింది.. వారికి రావాల్సినవి ఇస్తే సరిపోతుంది. ఐదేండ్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలుగా పదవిలో ఉన్న నేతలకు పింఛన్ ఇచ్చినప్పుడు.. 30 ఏండ్లు సేవలందించిన ఉద్యోగులకు పింఛన్ ఎందుకు ఇవ్వకూడదు. రిటైర్మెంట్ వయసు పెంచడం నిరుద్యోగులకు అన్యాయం చేయడమే.
– సిద్ధగౌని సుదర్శన్,
ఉస్మానియా యూనివర్సిటీ,స్టూడెంట్ జేఏసీ నేత
సారూ.. ఉద్యమకారులు యాదిలేరా?
- వెలుగు ఓపెన్ పేజ్
- January 6, 2021
లేటెస్ట్
- IPL 2025 Mega Action: వేలంలో మెరిసిన SRH.. హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
- ఈ సారి అంతంత మాత్రమే.. 2025 సీజన్ RCB పూర్తి జట్టు ఇదే
- US Probe Effect: అదానీతో వ్యాపారం రద్దు చేసుకున్న ఫ్రాన్స్ కంపెనీ
- మెగా వేలంలో 20 మందిని కొన్న చెన్నై.. నెక్ట్స్ సీజన్‌కు CSK ఫుల్ స్క్వాడ్ ఇదే
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- నార్మన్ పోస్టర్స్ సంస్థకు దక్కిన అమరావతి భవనాల డిజైన్ల టెండర్
- కారు డ్రైవర్ నిర్లక్ష్యం..ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు తీసింది
- ఐపీఎల్ మెగా వేలంలో ఏపీ క్రికెటర్ల హవా.. ఆక్షన్‌లో ముగ్గురు సోల్డ్
- ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం.. కోటీశ్వరుడైన 13 ఏళ్ల కుర్రాడు
- మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలిరావాలి: ఎమ్మెల్యే వివేక్
Most Read News
- Gold rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
- IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
- IPL 2025 Mega Action: ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట: కేకేఆర్ ప్లేయర్ డిమాండ్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‌తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే
- Good Health : మీకు షుగర్ ఉందా.. అయితే ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి.. ఎనర్జీతోపాటు ఆరోగ్యం కూడా..
- బ్యాంకాక్ నుంచి విషపూరిత పాములు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
- పారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా
- Aadhaar Card: ఆధార్ కార్డులో కరెక్షన్ రూల్స్ మరింత కఠినతరం..ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందే
- తలుపులు మూసేసి రాత్రంతా దందా.. పాతబస్తీలో పోలీసుల ఆకస్మిక దాడులు