ఎల్ఆర్ఎస్ గడువు పెంచిన ప్రభుత్వం

వర్షాల వల్ల కరెంట్ సరఫరాలో అంతరాయం

పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ఎల్ ఆర్ ఎస్ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం రాత్రి చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. గురువారం రాత్రి 9 గంటల వరకు ఎల్ ఆర్ ఎస్ కు 19.33 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల కరెంటు సరఫరాలో అంతరాయం, ఇంటర్నెట్ సరిగా లేనందున గడువు పెంచాలని ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్ పేర్కొన్నారు.  వర్షాల వల్ల చాలా మంది అప్లికేషన్లు పెట్టుకోలేదన్నారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్.. మున్సిపల్, పంచాయతీరాజ్ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

For More News..

వరదల వల్ల 35 వేల ఇండ్లకు కరెంట్​ కట్​

నగరంలో వరదల్లో గల్లంతై చనిపోయింది వీళ్లే..

హైదరాబాద్‌లో ఇంకా నీటిలోనే 800 కాలనీలు