నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా కొత్త ఎస్పీగా శరత్చంద్ర పవార్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఈస్ట్ మారేడపల్లికి చెందిన శరత్ చంద్ర ముంబై ఐఐటీలో చదివారు. పవార్ తండ్రి డాక్టర్ బాలాజీ పవార్గతంలో రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓగా పనిచేశారు.
ఖానాపూర్మాజీ ఎమ్మెల్యే రేఖ్యా నాయక్‌కు శరత్ చంద్ర అల్లుడు. గత ప్రభుత్వంలో మహబూబాద్గా ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం ఇ క్కడ పనిచేస్తున్న చందనా దీప్తిని సికింద్రాబాద్ రైల్వే డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేశారు.