దేవరకొండ, డిండి వెలుగు : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై సర్కారు ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా శనివారం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ దేవరకొండ మండలంలోని గొట్టిముక్కల, చందంపేట మండలంలోని నక్కలగండి, డిండి మండలంలోని డిండి ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రాజెక్టుల నిర్మాణం ఎంత వరకు కంప్లీట్ అయ్యింది? ఎన్ని ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది..?
ఎంత పూర్తయ్యింది..? ఇంకా ఎన్ని ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించాలి..? తదితర విషయాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాజెక్టుల కింద ముంపునకు గురవుతున్న భూములు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వివరాలపైనా ఆరా తీశారు.