ఏటూరునాగారంలో బస్​ డిపోకు మోక్షం

ఏటూరునాగారంలో బస్​ డిపోకు మోక్షం
  •     ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

ఏటూరునాగారం, వెలుగు : ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో బస్​ డిపో నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం ఉత్వర్వులు  జారీ చేసింది.  త్వరలో నే పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొంది.  ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాకు చెందిన మంత్రి సీతక్క రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ లను కలిసి శాలువాలతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. 

వీరి వెంట  కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్​ ఉన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో బస్​ డిపో అనుమతులకు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, స్థానికులు బస్​ స్టేషన్​ లో  సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్​ ఫొటోలకు క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్క్షతలు తెలిపారు.