కుటుంబ సర్వే ఫార్మాట్ ఇదే: ఈ వివరాలు అన్నీ రెడీ చేసుకోండి

కుటుంబ సర్వే ఫార్మాట్ ఇదే: ఈ వివరాలు అన్నీ రెడీ చేసుకోండి

హైదరాబాద్: తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని డిసైడ్ అయిన ప్రభుత్వం.. ఈ మేరకు 2024, అక్టోబర్ 29న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫామ్‎ను రిలీజ్ చేసింది. 
ఈ ఫామ్‎లో అధికారులు సేకరించనున్న వివరాలకు సంబంధించిన ప్రశ్నలను ప్రభుత్వం వెల్లడించింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా అధికారులు మొత్తం రెండు పార్టీలుగా వివరాలు సేకరించనున్నారు. 

కుటుంబ యజమాని కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు అధికారులు నమోదు చేసుకోనున్నారు. ప్రతి కుటుంబం యొక్క సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులానికి సంబంధించిన వివరాలు అధికారులు సేకరించనున్నారు. ఈ సర్వేలో కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటు వారి భూములు, రిజర్వేషన్లు, రాజకీయ నేపథ్య వివరాలను సైతం అధికారులు అడిగి తెలుసుకోనున్నారు. 

2024, నవంబర్ 6వ తేదీ నుండి ఈ సర్వే మొదలు కానుంది. రాష్ట్ర ప్రణాళిక శాఖకు ఈ సర్వే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. కాగా, రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ మేరకు జీవో నెంబర్ 18ను జారీ చేసిన విషయం తెలిసిందే. సమగ్ర కుటుంబ సర్వే చేయాలని ఫిబ్రవరి 4న కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని గతంలో అసెంబ్లీ ఆమోదించడంతో ఈ మేరకు అధికారులు సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నారు. 

​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​