గ్రామీణ రోడ్లకు మహార్దశ.. 92 నియోజకవర్గాల్లో పనులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

గ్రామీణ రోడ్లకు మహార్దశ.. 92 నియోజకవర్గాల్లో పనులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ పట్టింది. రోడ్ల నిర్మాణానికి కాంగ్రెస్​ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను మంజూరు చేసింది. 92 నియోజకవర్గాల్లో 641 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  గ్రామాల్లో1,323 కి.మీ మేర కొత్త రహదారుల నిర్మాణ పనుల కోసం రూ.1,377.66 కోట్లను రిలీజ్​చేసింది. మరోవైపు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించడంపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క థ్యాంక్స్​చెప్పారు. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. సీఆర్ఆర్ రోడ్ల కోసం మరో రెండు, మూడు రోజుల్లోనే రూ. 400 కోట్ల మేర నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.