మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. 37 కోట్ల 50 లక్షల నిధులు విడుదల

మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. 37 కోట్ల 50 లక్షల నిధులు విడుదల

హైదరాబాద్: మూసీ నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిర్వాసితులకు ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‎కు రూ.37 కోట్ల 50 లక్షలు ఫండ్స్ విడుదల చేస్తూ శనివారం (ఫిబ్రవరి 1)   పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్న వారికి ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.25 వేల ఆర్థిక సహయం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. శనివారం (ఫిబ్రవరి 1)15 వేల కుటుంబాలకు రూ.25 వేల చొప్పున సర్కార్ నిధులు విడుదల చేసింది. మూసీ నిర్వాసితులు ఇండ్లు ఖాళీ చేసే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. 

ALSO READ | ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి కుల గణన రిపోర్టు

మురికి కూపంలో మునిగిపోయిన మూసీ నదిని పునరుజ్జీవం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మూసీని ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. ఇందులో భాగంగానే మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారిని ప్రభుత్వం ఖాళీ చేయిస్తోంది. వారి మరో చోట పునరావాసం కల్పించడంతో పాటు..  ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్న వారికి ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్న వారికి రూ.25 వేల ఆర్థిక సహయం అందజేస్తోంది.