
- రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
- పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్‌గా సంజయ్ కుమార్
- స్మితాపై బదిలీ వేటు.. టూరిజం నుంచి ఫైనాన్స్ కమిషన్‌కు..
- జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్.వి.కర్ణన్
- హెచ్ఎండీఏ లిమిట్స్ సెక్రటరీగా ఇలంబర్తి
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పరిపాలనలో కొత్త ఊపు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 20 మంది ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్చేపడుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. చాలాకాలం పాటు ఇండస్ట్రీస్ డిపార్ట్ మెంట్స్పెషల్సీఎస్గా ఉన్న జయేశ్‌రంజన్‌ను ప్రభుత్వం సీఎంవోలోకి తీసుకున్నది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇండస్ట్రీస్అండ్ఇన్వెస్ట్మెంట్సెల్సీఈవోగా, స్పెషల్సీఎస్గా ఆయనకు పోస్టింగ్ఇచ్చింది. సీఎంవోలో కొత్తగా ఇండస్ట్రీస్అండ్ఇన్వెస్ట్మెంట్సెల్ను ఏర్పాటు చేశారు.
దీంతోపాటు స్మార్ట్ ప్రొయాక్టివ్ఎఫిషియెంట్అండ్ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) బాధ్యతలు కూడా జయేశ్‌రంజన్‌కు అప్పగించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో వివాదాస్పద ట్వీట్లు పెట్టిన స్మితా సబర్వాల్‌పైన బదిలీ వేటు పడింది. ఆమెను యువజన వ్యవహారాలు, టూరిజం శాఖ నుంచి తీసేసి రాష్ట్ర ఫైనాన్స్కమిషన్మెంబర్ సెక్రటరీగా నియమించింది.
అంతకుముందు స్మితా సబర్వాల్ఇదే పోస్టులో పనిచేశారు. యువజన వ్యవహారాలు, టూరిజం, సాంస్కృతిక శాఖ అదనపు బాధ్యతలను జయేశ్‌రంజన్‌కు ప్రభుత్వం అప్పగించింది. సీనియర్ ఐఏఎస్సంజయ్ కుమార్‌ను పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, క్రీడల శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్.వి కర్ణన్నియమితులయ్యారు .
ఎఫ్‌సీడీఏ కమిషనర్‌గా కె.శశాంక
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కమిషనర్‌గా కె. శశాంక బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఇలంబర్తి మెట్రో పాలిటన్ ఏరియా అండ్‌అర్బన్ డెవలప్‌మెంట్ (హెచ్ఎండీఏ) సెక్రటరీగా, మున్సిపల్అడ్మినిస్ట్రేషన్అండ్ అర్బన్డెవలప్మెంట్అథారిటీ ప్రిన్సిపల్సెక్రటరీగా ఉన్న దాన కిషోర్‌ను కార్మిక, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే గవర్నర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్ కొనసాగనున్నారు.
కీలక విభాగం చూస్తున్న దాన కిషోర్‌పై బదిలీ వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎంసీహెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్‌గా శశాంక్ గోయల్.. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌గా బదిలీ అయ్యారు. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్ పోస్టుకు అదనపు బాధ్యతలు చూడనున్నారు. జెన్ కో సీఎండీగా హరీశ్‌ను ప్రభుత్వం నియమించింది. ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.