బోధన్​– బీదర్​ రైల్వే లైన్కు పచ్చ జెండా ఎప్పుడో?

నిజామాబాద్,  వెలుగు:  జిల్లాను కర్నాటకతో  అనుసంధానించే బోధన్ ​–  బీదర్​ రైల్వే లైన్​  ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  తెలంగాణ వచ్చాక వంద రోజుల్లో  నిజాం షుగర్​ ఫ్యాక్టరీ పునరుద్ధరణతోపాటు బీదర్​ రైల్వే లైన్​ పై టీఆర్​ఎస్​ పార్టీ హామీలిచ్చింది.   9 ఏళ్లుగా  ఈ​  రైల్వేలైన్ పై ​ సర్కార్​ చొరవ చూప  లేదు.  రాష్ట్రంలోని  రైల్వేప్రాజెక్ట్​ లకు  సర్కార్​  ప్రపొజల్స్​ పంపకుండా  కేంద్రంపై   దుష్ర్పచారం చేస్తోందని బీజేపీ  ఆరోపిస్తోంది.  సరిహద్దులోని కర్నాటక ప్రాంతానికి రవాణ సదుపాయాలు మెరుగు పర్చడంతో పాటు, నిజాం షుగర్​ ఫ్యాక్టరీలో చెరుకు రవాణా ఈజీ అవుతుందని ఈ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెనుకబడిన జుక్కల్, బాన్స్ వాడ నియోజకవర్గాలతో పాటు సరిహద్దు జిల్లాల్లో రైల్వే రవాణను అభివృద్ధి చేసేందుకు ఈ  రైల్వేలైన్  కోసం సర్వే చేశారు.   ఉమ్మడి మెదక్ జిల్లా, కర్నాటకలోని  పలు ప్రాంతాల  నుంచి చెరుకు పంటను నిజాంషుగర్స్ కు తరలిస్తే..  రవాణా  భారం తగ్గుతుందని భావించారు.  120 కిలోమీటర్లు రూ. 250 కోట్ల బడ్జెట్ తో  రైల్వేలైన్ ప్రతిపాదనలు తయారు చేశారు.  సర్వే పనులకు కేంద్రం ఆరు సార్లు రూ. 12 కోట్లు కేటాయించింది.  ఎన్నికల హామీగా రైల్వేలైన్.. 
రైల్వేలైన్ ఏర్పాటుకు 2004  నుంచి 2014  వరకు  చేసిన సర్వేలు చివరిదశకు చేరాయి.   పనులకు బడ్జెట్ కేటాయింపులు మాత్రమే మిగిలాయి. 2014 తర్వాత   ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి రైల్వే ప్రాజెక్ట్ లకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.  బోధన్ – బీదర్ రైల్వే లైన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్​ రెడీ చేసి, కేంద్రానికి  పంపితే అనుమతికి అవకాశం ఉంటుంది. కానీ,  దానికి రాష్ట్రం ఎలాంటి ప్రతిపాదనలూ పంపడం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. 

 బడ్జెట్​పై కేంద్రం వివక్ష 

 కేంద్ర రైల్వేబడ్జెట్  ప్రాజెక్ట్ లకు బీజేపీ  వివక్షతో మంజూరు ఇవ్వడంలేదు. బీదర్  బోధన్ రైల్వే లైన్ నిధుల మంజూరుపై బీజేపీ సర్కార్  నిర్లక్ష్యం చేస్తుంది.  రాజకీయదురుద్దేశంతో ఆరోపణలు సరికాదు. పెద్దపల్లి రైల్వేలైన్  పూర్తి చేసిన ఘనత  టీఆర్​ఎస్​కు  దక్కింది.  వచ్చే బడ్జెట్ లోనైనా బీదర్ బోధన్ రైల్వే లైన్ కు నిధులు మంజూరు చేయాలి.
- జీవన్​ రెడ్డి జిల్లా ప్రెసిడెంట్, బీఆర్​ఎస్​

రాష్ట్ర సర్కార్​ నిర్లక్ష్యం 

రాష్ట్ర ప్రభుత్వం బోధన్ – బీదర్ రైల్వే లైన్ ప్రతిపాదనలుపంపడంలేదు. కొత్త రైల్వే ప్రాజెక్ట్  విషయంలో  టీఆర్ఏస్ కావాలనే నిర్లక్ష్యంగాఉంది.  కేంద్రంలోని  బీజేపీ సర్కార్​ కు  చెడ్డపేరు రావాలని టీఆర్ఏస్ కుట్ర చేస్తోంది.  
- అడ్లూర్​ శ్రీనివాస్​  దిశ కమిటీ సభ్యుడు ​