ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు సాగిస్తోంది ప్రభుత్వం. ఇవాళ్టి నుంచి అభ్యంతరాలు, సూచనలపై సమీక్షలు చేయనున్నారు అధికారులు.అన్ని జిల్లాల్లో కలిపి 1,478 అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 700 అభ్యంతరాలు, అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో 16 విజ్ఞప్తులు వచ్చినట్లుగా చెబుతున్నారు. మొత్తం 13 జిల్లాల కలెక్టర్లతో నెల 28వ తేదీ వరకు సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. తిరుపతి, విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం నగరాలలో సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
కృష్ణా,పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో 23వ తేదీన విజయవాడలో సమావేశం నిర్వహించనున్నారు. 24వ తేదీన తిరుపతిలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లా కలెక్టర్‌తో సమావేశం జరగనుంది. 26వ తేదీన అనంతపురంలో అనంతపురం, కర్నూలు జిల్లా కలెక్టర్‌తో సమావేశం జరగబోతుంది. 28వ తేదీన విశాఖపట్నంలో విశాఖపట్నం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్‌తో సమావేశం జరగనుంది.
మరిన్ని వార్తల కోసం
పేరెంట్స్ ఓటేస్తే.. పిల్లలకు 10 మార్కులు
ఇటుక బట్టీలో కోటి రూపాయల డైమండ్