కార్మికులకు సర్కారు అండగా ఉండాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

కార్మికులకు సర్కారు అండగా ఉండాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

వేములవాడ, వెలుగు: కార్మికులకు కాంగ్రెస్​ ప్రభుత్వం అండగా నిలబడాలని, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సీసీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని  గుమ్మిపుల్లయ్య భవన్ లో భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ జిల్లా మహాసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు కొత్త లేబర్  కార్డులు ఇవ్వాలని, పెండింగ్  ఫైల్స్  క్లియర్  చేయాలన్నారు. సహజ మరణానికి రూ.5 లక్షలు, యాక్సిడెంట్ కు రూ.10 లక్షలు, 55 ఏండ్లు నిండిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్  ఇవ్వాలని కోరారు. అర్హులకు డబుల్  బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని, అడ్డాల వద్ద విశ్రాంతి గదులు, సౌలతులు కల్పించాలన్నారు.

హెల్త్  కార్డులు ఇవ్వాలని, పాత లేబర్  కార్డులను రెన్యూవల్  చేయాలని, రేషన్ కార్డునే ఫ్యామిలీ మెంబర్  కార్డుగా పరిగణించాలని కోరారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, మారగోని ప్రవీణ్ కుమార్, టేకుమల్ల సమ్మయ్య పాల్గొన్నారు.