కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం వస్తది : వినయ్ భాస్కర్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం వస్తదని ప్రభుత్వ చీఫ్‌‌‌‌‌‌‌‌ విప్‌‌‌‌‌‌‌‌ ధాస్యం వినయ్‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. కేంద్రంలో ప్రస్తుతమున్న బీజేపీ.. బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. తమకు అధికారం వచ్చాక బీసీల సంక్షేమానికి పాటుపడతామని వెల్లడించారు. శుక్రవారం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎల్పీలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌లకు కేంద్రం గండికొడుతోందని.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తోందని వినయ్ భాస్కర్ తెలిపారు.

బీసీ సంక్షేమంలో దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్‌‌‌‌‌‌‌‌ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీకి ఓబీసీ సెల్‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పుడు..ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై ఎంపీ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని నిలదీశారు. కేంద్రం కక్ష గట్టి బీసీ పారిశ్రామికవేత్తలపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఒక బీసీ వ్యక్తి ప్రధాని అయినా.. బీసీలకు బియ్యపు గింజంత మేలు కూడా జరగలేదని వివరించారు.