సావరిన్ గోల్డ్ బాండ్లతో దండిగా పైసలు.. ఇన్వెస్టర్లకు 193 శాతం రిటర్న్‌‌‌‌

సావరిన్ గోల్డ్ బాండ్లతో  దండిగా పైసలు.. ఇన్వెస్టర్లకు 193 శాతం రిటర్న్‌‌‌‌

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు:  సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్‌‌‌‌జీబీల)లో ఇన్వెస్ట్ చేసిన వారు భారీగా లాభపడుతున్నారు.  2016–17 లో ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఇష్యూ చేసిన సిరీస్ 4 బాండ్లు  ఈ  నెల 17న మెచ్యూర్ కానున్నాయి.  ఒక్కో గ్రాముపై రిడీమ్‌‌‌‌ (చెల్లించే)  ధరను ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించింది. గ్రాముకు రూ.8,624 చెల్లించనుంది. ఈ నెల 10, 13 తేదీల మధ్య 999 ప్యూరిటీ గల బంగారం ధరల యావరేజ్ రేటును పరిగణనలోకి తీసుకొని ఈ ధరను నిర్ణయించింది. ఇండియన్‌‌‌‌ బులియన్ అండ్ జ్యువెలర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ రేట్లను  పబ్లిష్  చేసింది.  

2016–17 సిరీస్ 4 గోల్డ్ బాండ్లను ఒక్కో గ్రాముకు రూ.2,943 దగ్గర కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ అమ్మింది. 2017 ఫిబ్రవరిలో వీటిని అమ్మగా, వీటి రిడీమబుల్‌‌‌‌ ధర ప్రస్తుతం రూ.8,624 కు చేరుకుంది. అంటే  పెట్టుబడి సుమారు 193 శాతం పెరిగింది. దీనికి అదనంగా  సావరిన్ గోల్డ్ బాండ్లపై  ఇన్వెస్టర్లు ఏడాదికి 2.5 శాతం వడ్డీ కూడా పొందారు. మరోవైపు ఎస్‌‌‌‌జీబీ 2019–20 సిరీస్‌‌‌‌ 4 బాండ్లను  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 17, 2019 లో ఇష్యూ చేయగా, ఇవి కూడా  మార్చి 17 న మెచ్యూర్ అవుతున్నాయి.   ఒక్కో గ్రాము గోల్డ్‌‌‌‌కు రూ.8,634 ను ప్రభుత్వం చెల్లిస్తుంది. 

 సావరిన్ గోల్డ్ బాండ్లు ఎనిమిదో ఏట మెచ్యూర్ అవుతాయి. వీటిపై వచ్చే లాభాలపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడదు.  కానీ ప్రతీ ఏడాది పొందే వడ్డీ ఆదాయంపై మాత్రం ట్యాక్స్‌‌‌‌ పడుతుంది. ఐదో ఏట నుంచి  ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ అవ్వొచ్చు. ఎస్‌‌‌‌జీబీలు డీమాట్ ఫార్మెట్‌‌‌‌లో ఉంటే మెచ్యూర్ కాకముందు ఎక్స్చేంజ్‌‌‌‌లో అమ్ముకోవచ్చు. ఎస్‌‌‌‌జీబీలను గిఫ్ట్‌‌‌‌లుగా రిలేటివ్స్‌‌‌‌కు ఇవ్వొచ్చు కూడా.
మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేస్తే వచ్చే లాభాలు..
    
ఎస్‌‌‌‌జీబీలను  మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేస్తే క్యాపిటల్‌‌‌‌ గెయిన్స్‌‌‌‌ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందొచ్చు. ఈ బాండ్లు ఇష్యూ అయిన తేదీ నుంచి ఎనిమిదో ఏట మెచ్యూర్ అవుతాయి. ఐదో ఏట నుంచి ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ అవ్వొచ్చు. ఇలాంటి బాండ్లను రిడీమ్ చేసుకున్నా, ఎస్‌‌‌‌జీబీలపై వచ్చిన లాభాలపై  క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడదు.  మెచ్యూర్ కాకముందు మార్కెట్‌‌‌‌లో అమ్మితే మాత్రం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. ఇన్వెస్టర్ హోల్డ్ చేసిన టైమ్ బట్టి లాంగ్ టెర్మ్‌‌‌‌ లేదా షార్ట్‌‌‌‌ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వేస్తారు. 
    
ఎస్‌‌‌‌జీబీలతో గ్యారెంటీగా  లాభపడొచ్చు.  ఎందుకంటే ప్రభుత్వం ప్రతీ ఏడాది 2.5 శాతం వడ్డీ ఇస్తోంది.  ఆరు నెలలకొకసారి చెల్లిస్తోంది. నిలకడగా ఆదాయం పొందొచ్చు.  
    
మెచ్యూరిటీ అయిన తర్వాత బాండ్లకు చెల్లించే రిడంప్షన్ రేటు మార్కెట్‌‌‌‌కు లింక్ అయి ఉంటుంది. అంటే గోల్డ్ రేటు పెరిగితే ప్రభుత్వం  చెల్లించే రిడంప్షన్ రేటు కూడా పెరుగుతుంది. 
    
ఎస్‌‌‌‌జీబీల్లో ఫిజికల్ గోల్డ్‌‌‌‌ ప్రస్తావన ఉండదు. ఇన్వెస్టర్లు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. ప్రభుత్వం డబ్బులతోనే చెల్లింపులు జరుపుతుంది. సావరిన్ బాండ్లు కాబట్టి  సేఫ్టీ, సెక్యూరిటీ గ్యారెంటీ.
    
పేపర్ లేదా ఎలక్ట్రానిక్ రూపంలో ఎస్‌‌‌‌జీబీలు ఉంటాయి. గోల్డ్‌‌‌‌తో ఎదురయ్యే స్టోరేజ్‌‌‌‌, సెక్యూరిటీ, ఇన్సూరెన్స్ వంటి  సమస్యలు ఎస్‌‌‌‌జీబీలతో  ఉండవు. 

ఈ ఏడాది లేనట్టే..

గోల్డ్ రేట్లు భారీగా పెరగడంతో ప్రభుత్వం కొత్త సిరీస్ ఎస్‌‌‌‌జీబీల ఇష్యూని తాత్కాలికంగా ఆపింది. ఈ స్కీమ్‌‌‌‌ను 2016 లో ప్రకటించగా,  2024 వరక కొనసాగింది. ఇప్పటికే ఇష్యూ చేసిన  ఎస్‌జీబీల నుంచి  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించిన టైమ్ పీరియడ్‌‌‌‌లో ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ అవ్వొచ్చు. వీటిని  కొన్న టైమ్‌‌‌‌లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్‌‌‌‌కు వడ్డీ, మెచ్యూర్ అయ్యాక ఇచ్చే అమౌంట్‌‌‌‌ను వేస్తారు. మెచ్యూరిటీ గురించి నెల రోజుల ముందు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ తెలియజేస్తుంది. బ్యాంక్ అకౌంట్ వివరాలు  మార్చాల్సి వస్తే సంబంధిత బ్యాంక్‌‌‌‌ లేదా పోస్ట్ ఆఫీస్‌‌‌‌ లేదా ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌సీఐఎల్‌‌‌‌కు తెలియజేయాలి.