![ప్రతి నియోజకవర్గంలో 2వేల ఇండ్లు..](https://static.v6velugu.com/uploads/2023/02/Rs-3-lakh_D3Tc0eCGPB.jpg)
సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ. 3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి నియోజకవర్గంలో 2వేల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు బడ్జెట్ లో ప్రతిపాదించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 2000 మంది చొప్పున 2,38,000 మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున బడ్జెట్ లో ఈ పథకానికి 7,890 కోట్లు ప్రతిపాదించినట్లు హరీష్ రావు ప్రకటించారు.
ఈ పథకంతో సామాన్యులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ.12,000 కోట్లను ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది.