పుష్ప డైలాగ్‎తో అదరగొట్టిన ‘ది గ్రేట్ ఖలీ’

పుష్ప డైలాగ్‎తో అదరగొట్టిన ‘ది గ్రేట్ ఖలీ’

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా  గత నెలలో థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా పాటలు, డైలాగులు ఎప్పటి నుంచో వైరల్ అవుతున్నాయి. చిత్రంలోని పాటలు, డైలాగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ కోసం దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కట్టిపడేస్తోంది. ఆ పాటలకు హీరోలు, ప్లేయర్లు, సినీ ప్రియులు స్పూఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. శ్రీవల్లి, ఊ అంటావా.. ఊఊ అంటావా, సామిసామి పాటలకైతే ఓ రేంజ్‎లో క్రేజ్ వచ్చింది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఇండియన్ క్రికెటర్లు సురేష్ రైనా, హార్దిక్ పాండ్యాలు ఇటీవల శ్రీవల్లి హుక్ స్టెప్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. తాజాగా ఇదే సినిమాలోని ‘తగ్గేదేలె’ డైలాగ్ ను ‘ది గ్రేట్ ఖలీ’ చెప్పి అందరినీ ఆకర్షించాడు. ఈ డైలాగ్ కు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకున్నాడు. ఈ వీడియోకు ఇప్పటివరకు 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోలో ఖలీ.. అల్లు అర్జున్ ‘ఝుకేగా నహీ’ డైలాగ్‌ను రీక్రియేట్ చేయడాన్ని చూడొచ్చు. ‘పుష్పా, పుష్ప రాజ్. మే ఝుకేగా నహీ’ అని వీడియోలో లిప్ సింక్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

For More News..

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు కొత్త పవర్