![ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్](https://static.v6velugu.com/uploads/2024/01/the-greatest-of-all-time-movie-first-look-poster-release_TCRL7wnr1Z.jpg)
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కి టాలీవుడ్‌లోనూ మంచి ఇమేజ్ ఉంది. తన సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అంతలా కాన్సెప్ట్ సెలెక్షన్ విషయంలో కేర్ తీసుకుంటాడు విజయ్. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన 68వ చిత్రంలో నటిస్తున్నాడు. కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెబుతూ ఆదివారం సాయంత్రం ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
‘ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోందని రివీల్ చేశారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వయసు పెరిగిన విజయ్‌తో పాటు యంగ్ లుక్‌లో ఉన్న విజయ్ కూడా కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. ఇద్దరూ ఆర్మీ డ్రెస్‌లో ఆకట్టుకుంటున్నారు. పోస్టర్‌ని బట్టి విజయ్ తండ్రీ కొడుకులుగా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడని అర్ధమవుతోంది. ప్రియా భవానీ శంకర్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. స్నేహ, లైలా, జయరాయ్, ప్రశాంత్, ప్రభుదేవా, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అర్చన కల్పతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.