Thalapathy Vijay Birthday: తలపతి పుట్టినరోజు.. ది గోట్ మూవీ నుండి స్పెషల్ టీజర్

Thalapathy Vijay Birthday: తలపతి పుట్టినరోజు.. ది గోట్ మూవీ నుండి స్పెషల్ టీజర్

తమిళ స్టార్ విజయ్ తలపతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్లో ఆయనకు భారీ క్రేజ్ ఉంది. ఆయన సినిమా విడుదల అయ్యింది అంటే అప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవ్వాల్సిందే. ఇటీవలే లియో సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విజయ్.. ప్రస్తుతం డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది. 

జూన్ 22 తలపతి విజయ్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేశారు మేకర్స్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ఎలిమెంట్ ను హైలెట్ చేస్తూ టీజర్ విడుదల చేశారు. ఒకే బైక్ పై ఇద్దరు విజయ్ లతో ప్రయాణిస్తున్న షాట్ తో మొదలైన ఈ టీజర్.. యాక్షన్ సీక్వెన్స్ తో నింపేశారు. అందులో ఒకరు ఎజుడ్ విజయ్ కాగా.. ఇంకొకరు యంగ్ విజయ్ లా కనిపిస్తున్నారు.

ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. ఇక విజయ్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. విజయ్ తమకు ఒకేరోజు  రెండు పండుగలు తెచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభుదేవా, ప్రశాంత్ కీ రోల్స్ చేస్తుండగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.