- అదానీ గ్రీన్ ఎనర్జీ సబ్సిడరీల విలీనం
న్యూఢిల్లీ : అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన రెండు స్టెప్ డౌన్ అనుబంధ సంస్థలైన అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ ఫిఫ్టీ సిక్స్ లిమిటెడ్, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ ఫిఫ్టీ సెవెన్ లిమిటెడ్‌లను విలీనం చేస్తున్నట్లు శుక్రవారం ఈ గ్రూపు ప్రకటించింది. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్ నైన్ లిమిటెడ్ కంపెనీ పూర్తి- యాజమాన్య అనుబంధ సంస్థ. ఇది అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ ఫిఫ్టీ సిక్స్ లిమిటెడ్, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ ఫిఫ్టీ సెవెన్ లిమిటెడ్‌లను విలీనం చేసిందని గ్రూపు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. రెండు స్టెప్ డౌన్ అనుబంధ సంస్థలకు రూ. లక్ష చొప్పున ఆథరైజ్డ్, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఉంది.
పవన శక్తి, సౌరశక్తి లేదా ఇతర పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి ఏ రకమైన శక్తి లేదా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం, అభివృద్ధి చేయడం, మార్చడం, పంపిణీ చేయడం, ప్రసారం చేయడం, విక్రయించడం, సరఫరా చేయడం కొత్త అనుబంధ సంస్థల ప్రధాన లక్ష్యం. కొత్త అనుబంధ సంస్థలను ఈ నెల 14న గుజరాత్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో అహ్మదాబాద్‌లో రిజిస్టర్ చేశారు. ఇవి ఇంకా తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించలేదని అదానీ గ్రూపు తెలిపింది.
ఏఈసీటీపీఎల్ లో మెడిటరేనియన్కు వాటా
అదానీ ఎన్నోర్ కంటైనర్ టెర్మినల్ (ఏఈసీటీపీఎల్) లో 49 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ శుక్రవారం తెలిపింది. ఈ డీల్ విలువ రూ.247 కోట్లు. ఈ మేరకు వాటా కొనుగోలు ఒప్పందంపై డిసెంబర్ 14, 2023న సంతకం చేసినట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) ఒక ప్రకటనలో తెలిపింది. ఏఈసీటీపీఎల్ మొత్తం ఎంటర్‌ప్రైజ్ విలువ రూ. 1,211 కోట్లు అని పేర్కొంది. లావాదేవీ నియంత్రణ ఆమోదాలకు లోబడి ఉంటుంది. ఈ డీల్ 3-4 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. లావాదేవీ పూర్తయిన తర్వాత, ఏపీసెజ్‌కు ఏఈసీటీపీఎల్లో 51 శాతం వాటా ఉంటుందని ప్రకటన పేర్కొంది. ముండి లిమిటెడ్ అనేది టెర్మినల్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ అనుబంధ సంస్థ.