- గుజరాత్లో సెల్ఫీ వీడియో తీస్కొని ఉరేసుకున్న భర్త
రాజ్కోట్: భార్య వేధింపులు తాళలేక మరో భర్త ఉరేసుకుని చనిపోయాడు. కొద్దిరోజుల కింద గుజరాత్లోని బొటాడ్ జిల్లాలో ఈ ఘటన జరగ్గా, బాధితుడు తన మరణానికి ముందు తీసుకున్నసెల్ఫీ వీడియో బయటపడటంతో తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి భార్యను ఆదివారం అరెస్ట్ చేశారు.
జమ్రా గ్రామానికి చెందిన సురేశ్ సతాదియా(39) పోయినేడాది డిసెంబర్ 30 తన ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘నేను చనిపోతున్నా, ఇందుకు కారణమైన నా భార్య జయకు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పండి. ఆమె నాది కాదు, నా పిల్లలు ఆమెకు అక్కర్లేదు. నన్ను మోసం చేసింది. నా మరణానికి కారణం నా భార్యే’ అని వీడియోలో పేర్కొన్నాడు.