జై బోలో హనుమాన్కీ..కొండగట్టులో భక్తుల రద్దీ
ఇంకా తరలివస్తున్న స్వాములు
కొండగట్టులో మంగళవారం హనుమాన్చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది హనుమాన్ స్వాములు తరలిరావడంతో గుట్ట ప్రాంతం కిక్కిరిసింది. రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలతో పరిసరాలు మారుమోగాయి. సుమారు 30వేల మంది భక్తులు అంజన్నను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మాలవిరమణ అనంతరం హనుమాన్ దీక్షాపరులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, అడిషనల్ కలెక్టర్ మంద మకరంద్పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఇది ఇలా ఉంటే సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఏర్పాట్లను ఈవో వెంకటేశ్, ఏఈవో బుద్ది శ్రీనివాస్ తదితరులు పర్యవేక్షిచారు.
– కొండగట్టు,వెలుగు