కోటి రూపాయల విలువైన కారు, విలాసవంతమైన భవంతి లభిస్తే సకల సౌకర్యాలతో హాయిగా జీవితాన్ని గడపవచ్చని ఆశిస్తుంటాం. అయితే, కొంతమంది అలానే నివసించడానికి కోట్లరూపాయిలు వెచ్చించి ప్యాలెస్ లాంటి భవనాలను నిర్మించుకుంటారు. అలానే యుఎఇలోని రస్ అల్ ఖైమాలో ప్యాలెస్ ఉంది. దీనిని నిర్మించడానికి 15 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ ప్యాలెస్ మూడు దశాబ్దాలుగా ఎడారిగామారి అందులో ఎవరూ నివసించడం లేదు. ప్రస్తుతం దీనిని ప్రపంచంలోనే హాంటెడ్ ప్యాలెస్ గా పిలుస్తున్నారు.
UAEలోని రస్ అల్ ఖైమాలో ప్యాలెస్
యుఎఇలోని రస్ అల్ ఖైమాలో ఒక ప్యాలెస్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత హాంటెడ్ ప్యాలెస్‌గా చెప్పబడుతుంది. ఈ ప్యాలెస్ నిర్మించడానికి 15 సంవత్సరాలు పట్టిందట. ఈ రాజ భవంతిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో రస్ అల్ ఖైమాలో అల్ ఖాసిమి షేక్ నిర్మించాడు. దీనిని అల్ ఖమీసీ ప్యాలెస్ అని పిలుస్తారు. షేక్ విలాసాలవంతమైన జీవితాన్ని గడిపేందుకు నిర్మించాడని తెలుస్తోంది. అయితే షేక్ అందులో నివసించడానికి వచ్చి .. ఒక రోజు రాత్రి సమయంలో కుటుంబంతో సహా పారిపోయాడు. ఇప్పుడు ఈ ప్యాలెస్ మూడు దశాబ్దాలుగానిర్మానుష్యంగా మారింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాలక కుటుంబానికి చెందిన షేక్ అబ్దుల్-అజీజ్ బిన్ హుమైద్ అల్ ఖాసిమి 1985లో ఈ ప్యాలెస్‌ని నిర్మించారు. పాలరాతి అంతస్తులు, గ్లాస్ షాన్డిలియర్లు అందమైన డిజైన్లతో, నాలుగు-అంతస్తుల భవాన్ని నిర్మించారు. దీనిలో 35-బెడ్‌రూమ్ లు ఉన్నాయి. దీనిని నిర్మించేందుకు 1985లో 500 మిలియన్ AED లేదా £107 మిలియన్లు అని అంచనా వేస్తున్నారు.
షేక్ ఎందుకు పారిపోయాడు
షేక్ ప్యాలెస్ ఈ భవంతిలోనికి రోజు రాత్రిపూట గదులలో ఫర్నిచర్ ఎగురుతూ ... కిటికీలు ... గోడలపై ఎవరో ముఖాలు ఉన్నాయని అవి అతనిని బెదిరిస్తూ మాట్లాడుతూ చూడటారిఇ భయంకరంగా ఉన్నాయట. కొన్ని కనుమరుగవుతున్న విషయాలను కూడాషేక్ ఎదుర్కోవలసి వచ్చింది. రాజభవనంలో దుష్టశక్తులు తిరుగుతున్నాయని భావించిన షేక్.... భయంతోచాలా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వెంటనే ప్యాలెస్ వదిలి పారిపోయాడు.
మూడు దశాబ్దాలుగానిర్మానుష్యంగా ...
చాలా ఏళ్లుగా ఖాళీగా ఉన్న తర్వాత, ప్యాలెస్‌లో దెయ్యాలు ఉన్నాయని పుకార్లు వ్యాపించాయి. ఇప్పుడు దీనిని ప్రపంచంలోనే అత్యంత హాంటెడ్ ప్యాలెస్ అని పిలుస్తారు.మూడు దశాబ్దాలకు పైగా నిర్మానుష్యంగా, శిథిలావస్థలో ఉన్న ప్యాలెస్‌లో నేటికీ ఎవరూ కనిపించడం లేదు. జిన్ ... దుష్టశక్తులు ఖాళీ ప్రదేశాలలో నివసిస్తాయని సిద్ధాంతం. దశాబ్దాలుగా ఎడారిగా ఉన్న ఈ ప్యాలెస్‌ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి థ్రిల్ కోరుకునేవారు వస్తుంటారు.