ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ అప్డేట్స్

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ అప్డేట్స్

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ మొదలైంది. సంస్థ ఆర్ధిక పరిస్థితులపై కోర్టుకు అఫడవిట్ దాఖలు చేసింది ఆర్టీసీ. 2018-19 ఆర్ధిక సంవత్సారానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన 644 కోట్ల 51 లక్షల బకాయిల మొత్తం చెల్లించిందని తెలిపింది. హైదరాబాద్ లో బస్సులు నడుపుతున్నందుకు దాదాపు 1786కోట్లు చెల్లించాలని GHMCకి ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. రెండేళ్లకు కలిపి GHMC 336కోట్ల 40 లక్షలు విడుదల చేసిందని అఫడివిట్ లో పేర్కొంది ఆర్టీసీ. మిగిలిన సొమ్ము చెల్లించే స్థోమత లేదని GHMC ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. GHMC నిబంధనల ప్రకారం నగరంలో బస్సులు నడిపినందుకు వచ్చే నష్టాలను భర్తీ చేయడానికి GHMC అంగీకరించలేదని అధికారులు తెలిపారు. అందువల్ల ఆర్టీసీ నష్టాలను GHMC నుంచి రావాల్సిన బకాయిలుగా పరిగణించొద్దని GHMC తెలిపింది.

ఆర్టీసీలో నిర్వహణ, డీజీల్ భారం ఎక్కువగా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది యాజమాన్యం. సమ్మె మొదలైన అక్టోబర్ 5 నుంచి 30వ తేదీ వరకు 78కోట్లు సంస్థకు రాగా.. దాదాపు 160 కోట్లు ఖర్చైందని అఫడివిట్ లో పేర్కొంది ఆర్టీసీ. అంటే సమ్మె కాలంలో ఇప్పటివరకు దాదాపు 82కోట్లు నష్టం వచ్చిందని ఆర్టీసీ అంటోంది. అయితే హైకోర్టు అడిగినదానికి పొంతనలేని లెక్కలు ఆర్జీసీ చూపిస్తుందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన డాక్యుమెంట్స్ తెలుపకపోతే కోర్టు గందరగోళానికి గురికావాల్సి వస్తుందని చెప్పింది. నిర్వాహణ వ్యయంవల్లే సంస్థకి ఎక్కువగా నష్టం ఉందని తెలిపింది ఆర్టీసీ. ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులు చనిపోతున్న క్రమంలో ఇవాళ హైకోర్టు ఎం తీర్పు ఇస్తుందా అని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి.