- ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాల గాయబ్‌పై రిపోర్టు ఇవ్వండి..
- ఈసీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : జగిత్యాల జిల్లా ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించకుండా పోవడంపై దర్యాప్తు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 26లోగా రిపోర్ట్ సమర్పించాలని బుధవారం జస్టిస్ లక్ష్మణ్ ఉత్తర్వులు ఇచ్చారు. ధర్మపురి అసెంబ్లీ సీటుకు 2018లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫైళ్లు, ఈవీఎంలు భద్రం చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలోని కొన్ని లాకర్ల తాళాలు కనిపించకుండా పోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ధర్మపురి నుంచి బీఆర్‌ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా గెలవడంపై సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఎ.లక్ష్మణ్ రావు హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేశారు. వీవీపీఏటీ స్లిప్స్‌లో తేడాలున్నాయని, రీకౌంటింగ్‌కు ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ కోరారు. దీంతో స్ట్రాంగ్ రూమ్ భద్రత వ్యవహారంపై రిపోర్టు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.